చంద్రబాబు కోసం కొత్త కాన్వాయ్ కొనుగోలు అనేది అవాస్తవం..!

-

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో చరిత్ర సృష్టించాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన కోసం నూతన కాన్వాయ్ సిద్దమైందని.. తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద మొత్తం 11 వాహనాలను అధికారులు సిద్ధం చేసినట్లు  వార్తలు వినిపించాయి. ఇందులో రెండింటిని సిగ్నల్ జామర్ కోసం,  టయోటా కంపెనీకి చెందిన నలుపురంగు వాహనాలకు 393 నెంబర్లు వేశారని.. వీటిని చంద్రబాబు కాన్వాయ్ కోసం తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారని వచ్చిన వార్తపై ఖండించారు అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కోసం కొత్త కాన్వాయ్ కొనుగోలు అంటూ వార్తలు పూర్తిగా అవాస్తవం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్తలను అధికారులు ఖండించారు. కాన్వాయ్ కోసం వినియోగిస్తున్న వాహనాలు అన్ని పాత వాహనాలే, ఎప్పటి నుండో వినియోగిస్తున్నవే అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news