జగన్‌ ఫ్లెక్సీ తొలిగించిన కేశినేని నాని ?

-

Keshineni nani removed Jagan’s flexi: కేశినేని భవన్ పై ఫ్లెక్సీల తొలగింపు షురూ అయింది. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు నిన్న ప్రకటించారు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని. ఈ తరుణంలోనే.. కేశినేని నాని కార్యాలయం, కేశినేని భవన్ పై ఉన్న జగన్ ఫ్లెక్సీ సహా అన్నిటినీ తొలగిస్తున్నారు.

Kesineni nani removed Jagan flexi

ఎలాంటి రాజకీయా పోస్టులు, ఫ్లెక్సీలు లేకుండా ఉండాలని కేశినేని నాని ఆదేశాలు ఇచ్చారట. దీంతో కేశినేని నాని కార్యాలయం, కేశినేని భవన్ పై ఉన్న జగన్ ఫ్లెక్సీ సహా అన్నిటినీ తొలగిస్తున్నారు. కాగాఇక తాజాగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని నిన్న ప్రకటించారు కేశినేని నాని. తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

విజయవాడ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. విజయవాడ ప్రజలు తనకు స్పూర్తి అన్నారు. కొత్తగా గెలిచిన వారు విజయవాడ అభివృద్ధికి సహకరించాలని కోరారు. విజయవాడలో తాను గెలుస్తాననే ధీమాలో ఉన్నారు. కానీ తన సోదరుడు కేశినేని చిన్ని టీడీపీ అభ్యర్థి విజయం సాధించాడు.  2023 చివరిలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు కేశినేని నాని. అంతకు ముందే నాని, చిన్నికి మధ్య వివాదం తలెత్తింది.

Read more RELATED
Recommended to you

Latest news