Kodali Nani: కొడాలి నానికి మరో బిగ్ షాక్..ఆ కేసు నమోదు!

-

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి ఊహించని షాక్‌ తగిలింది. మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని పై మరో కేసు నమోదైంది. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటోనగర్‌కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, తూ. గో జిల్లా కలెక్టర్ మాధవీలతా రెడ్డిపై కూడా కేసు నమోదైంది.

పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత వైసీపీ నేతల పేర్లు ఎందుకు పెట్టావంటూ రాత్రంతా కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారన్నారు. కాగా, గుడివాడ ఆటోనగర్‌కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాసుదేవ రెడ్డి, కొడాలి నాని, వైకాపా కీలక నేతలు దుక్కీపాటి శశి భూషణ్, కసుకుర్తి బాబ్జి, పాలడుగు రాంప్రసాద్, కలెక్టర్ మాధవి లతా రెడ్డిలపై….. 448,427,506 r/w 34 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news