తెలుగు బిగ్ బాస్ లో కమల్..!

-

నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతుంది. హౌజ్ లో ఎలిమినేటర్స్ మళ్లీ రీ ఎంట్రీ క్రేజీ థాట్ అవ్వగా కౌశల్ కు తోడుగా నూతన్ నాయుడు మళ్లీ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లడం విశేషం. ఇక లేటెస్ట్ గా బిగ్ బాస్ హౌజ్ లో సర్ ప్రైజెస్ ఎక్కువయ్యాయి. ఇక ఈ వారం కూడా అలాంటి ఓ సర్ ప్రైజ్ ఉందట.

అదేంటి అంటే తెలుగు బిగ్ బాస్ లోకి తమిళ బిగ్ బాస్ హోస్ట్ గెస్ట్ గా వస్తున్నాడట. తమిళంలో బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న కమల్ హాసన్ తెలుగు బిగ్ బాస్ హౌజ్ లోకి వస్తాడట. ఇది నిజంగా సర్ ప్రైజ్ న్యూసే. మనకే ఇలా ఉంటే హౌజ్ లో ఉన్న కంటెస్టంట్స్ పరిస్థితి ఊహించుకోవచ్చు. తమిళంలో హోస్ట్ గా ఉంటున్న కమల్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో ఎంట్రీ కచ్చితంగా ఆడియెన్స్ ను మెప్పిస్తుంది.

దర్శక నిర్మాతగా కమల్ హాసన్ చేసిన విశ్వరూపం-2 ప్రమోషన్స్ లో భాగంగా కమల్ బిగ్ బాస్ హౌజ్ లోకి వస్తున్నాడు. తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సందడి చేస్తున్నాడు. ఈరోజు బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లారట కమల్. అంటే మనకు రేపటి ఎపిసోడ్ లో కమల్ కనిపిస్తారు. ఆగష్టు 10న కమల్ విశ్వరూఒపం-2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news