Leopard Tension at Mahanandi Temple: మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత హల్చల్ చేసింది. మహానంది దేవస్థానం కాలనిలో తాటి చెట్టు కింద చీకటిలోమాటేసింది ఓ చిరుత. కుక్కలు , కోతుల అరపులతో అలర్టైన స్థానికులు… చిరుత ఉన్నట్లు తేరుకున్నారు. ఆ తర్వాత బాణాసంచా పేలుస్తూ , కేకలు వేస్తూ వెంటాడారు యువకులు.
20 అడుగుల దూరంలో దూకి అడవిలోకి పరారైంది చిరుత. దీంతో స్థానికులు, దేవస్థానం సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. చిరుత ఇళ్ళ మధ్య కూడా సంచరిస్తున్నందున వెంటనే బంధించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు భక్తులు. ఇక అటు నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో చిరుతపులి కలకలం రేపింది. బుధవారం అర్ధరాత్రి చిరుత సంచారం సీసీకెమెరాల్లో రికార్డయింది. అర్ధరాత్రి సమయంలో టోల్ గేట్ చెకింగ్ పాయింట్ పక్కన చిరుతపులి సంచించిన వీడియోలు రికార్డయ్యాయి. టోల్ గెట్ పక్కన పడుకుని ఉన్న కుక్కను వేటాడి చిరుతపులి నోటితో పట్టుకుని వెళ్లింది.