ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లైన జొమాటో, స్విగ్గీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ ప్లాట్‌ఫామ్ ఫీజును 20 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. దిల్లీ, బెంగళూరు లాంటి బాగా డిమాండ్ ఉన్న నగరాల్లో, ఇకపై ప్లాట్‌ఫామ్ ఫీజుగా రూ.6 వసూలు చేయనున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటి వరకూ ఈ ఫీజు రూ.5గా ఉండగా.. స్విగ్గీ బెంగళూరులో తమ ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.7గా పేర్కొంది. రాయితీ తర్వాత దాన్ని రూ.6కు తగ్గించినట్లు తెలిపింది.
2023లో రూ.2తో దీన్ని ప్రారంభించిన ఈ సంస్థలు క్రమంగా పెంచుతూ వచ్చాయి. ఏప్రిల్‌లో జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును 25 శాతం పెంచి రూ.5 చేసింది. దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, లఖ్‌నవూ నగరాలకు ఈ పెంపును వర్తింపజేసింది. ఒక్కో ఆర్డర్‌పై పొందే ఆదాయాన్ని, మరింత పెంచుకోవడం కోసం ఫుడ్ డెలివరీ యాప్‌లు ఈ ప్లాట్‌ఫామ్ ఫీజును ప్రవేశపెట్టాయి. ప్రస్తుతం మార్కెట్‌లో జొమాటో, స్విగ్గీలదే పైచేయిగా ఉంది. ఈ నేపథ్యంలోనే క్రమపద్ధతిలో ఫీజును పెంచుతూ, మార్కెట్ వర్గాల స్పందనను పసిగడుతున్నాయి.