ఈ ఏడాది రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు మంజూరు చేసామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేవపెట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, అభివృద్ధితోనే రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి సాధ్యమన్నారు. మైనార్టీల సంక్షేమం కొరకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు.
2024-25 లో మైనార్టీ విద్యార్థులకు UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రభుత్వం ఉచిత శిక్షణ కార్యక్రమం చేపట్టింది. అత్యాధునిక విధానంలో శిక్షణ ఇవ్వడంతో పాటు లోకల్ అభ్యర్థులకు నెలకు రూ.2500, నాన్ లోకల్ అభ్యర్థులకు రూ.5,000 చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది రంజాన్ పండుగ వేడుకలకు రూ.33కోట్లు, అషూర్ ఖానాల పునరుద్ధరణకు రూ.50లక్షలు, ఈ ఏడాది జనవరిలో జరిగిన తబ్లిగీ జమాత్ ఇస్లామిక్ సమావేశానికి రూ.2.40 కోట్లు విడుదల చేశామని.. ముస్లిం సోదర, సోదరమణుల హజ్ యాత్రకు రూ.4.43 కోట్లను ఈ నెలలోనే మంజూరు చేసామన్నారు.