నేను ఇంకా తెలుగు మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నా : నారా లోకేష్

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. దానిపై చర్చ జరిగింది. మరో సారి కూడా చర్చ జరగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సభ్యులు కోరారు. చంద్రబాబు తప్పకుండా మరోసారి చర్చిద్దామని చెప్పారు. ఇదిలా ఉంటే..   విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో తెలుగు భాష పై స్పందించారు.

విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం అవసరం కాదనడం లేదు.  ఈ రోజు పోటీ పడాలి..  ఇతర దేశాలతో మన పిల్లలు పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీషు మీడియం చాలా అవసరం. అదేవిధంగా మళ్లీ విద్యార్థులు నాలాగా మాతృ భాష లో మాట్లాడటానికి ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడూ తడబడుతున్నానని వెల్లడించారు మంత్రి నారా లోకేష్. మాతృ భాష మరిచిపోకూడదు. మాతృ భాషను కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరముంది. ఇది సమగ్రంగా రివ్యూ చేస్తున్నాం. 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాను. ఉపాధ్యాయులతో, సంఘాలతో మాట్లాడుతాను. మీ అందరితో కూడా మాట్లాడి.. చర్చించాక నిర్ణయం తీసుకుందామని చెప్పారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news