జూలై నెలలో తిరుమలకు రికార్డు ఆదాయం..29వ సారి 100 కోట్లు !

-

జూలై నెలలో తిరుమలకు రికార్డు ఆదాయం వచ్చింది. 29వ సారి 100 కోట్లు దాటింది తిరుమల ఆదాయం. వరుసగా 29వ నెల 100 కోట్ల మార్క్ ను దాటింది తిరుమల శ్రీవారి హుండి ఆదాయం. జూలై నెలలో శ్రీవారికి హుండి ద్వారా 125 కోట్లు సమర్పించారు తిరుమల భక్తులు. ఈ ఏడాదిలో జూలై నెలలో వచ్చిన హుండి ఆదాయమే అత్యధికం కావడం విశేషం.

Tirumala Srivari Hundi revenue crosses 100 crore mark for 29th consecutive month

ఇది ఇలా ఉండగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది.
నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు 67916 మంది భక్తులు. అలాగే, తలనీలాలు సమర్పించిన 23010 మంది భక్తులుగా ఉన్నారు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 3.93 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news