ఖమ్మంలో దారుణం.. ఆగి ఉన్న లారీని బైకు ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి

-

తెలంగాణలో నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువకులు క్షణికావేశంలో తన నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. ఒక్క క్షణం ఆలోచిస్తే.. ఎలాంటి ప్రమాదం జరగదు. ప్రమాదం జరిగే ఆ క్షణంలోనే వారు ఓవర్ స్పీడ్ లేదా ఆవేశపడటంతో తన నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తాను ప్రాణాలను కోల్పోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలను సైతం తీస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ఓవర్ స్పీడ్ గా వెళ్లొద్దని.. వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినప్పటికీ అవేమి పట్టనట్టు వ్యవహరిస్తూ ప్రాణాలను కోల్పోతున్నారు. ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.  ఆగి ఉన్న లారీని బైకు ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్లితే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బి.గంగారం గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది బైక్. ఈ ప్రమాదంలో బేతి సురేశ్(22), ముద్దిన వేణు(19), కరీముల్లా(11) ముగ్గురు యువకులు అక్కడిక్కడే మరణించారు.. ప్రమాద తీవ్రతకు సురేశ్, వేణు తలలు పగిలి మెదళ్లు బయటకు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news