బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది గాలి వార్త.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతలు నిత్యం విమర్శించుకుంటున్నారు. అలాగే బీజేపీ-బీఆర్ఎస్ పొత్తు ఉందని.. అందుకే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదనే వార్తలు వినిపించాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని.. ఇప్పటికే కేసీఆర్ మోడీతో చర్చలు జరిపారనే వార్తలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది గాలి వార్త.  బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతుంది అని వస్తున్న పుకార్ల ను నమ్మవద్దన్నారు బాల్క సుమన్.  తెలంగాణ రాష్ట్ర పుట్టుకకు అస్తిత్వానికి కారణమైన పార్టీ బీఆర్ఎస్. 24 ఏండ్ల నుంచి ఇటువంటి మాటలు వింటూనే ఉన్నాం. 14 ఏళ్ళు తెలంగాణ రాష్టం కోసం పోరాడాము.. పదేళ్లు ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతుందని తెలంగాణ అంటే ఇష్టం లేని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్.. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news