మృతి చెందిన గురుకుల విద్యార్థి అనిరుధ్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

-

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ ఇటీవల మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్ధి అనిరుధ్ కుటుంబ సభ్యులని పరామర్శించారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అనిరుధ్ తల్లి బాధను మీరు విన్నారు, అలాంటి బాధ ఎవరు పడవద్దు. ప్రభుత్వ హాస్టల్లో అనిరుధ్ చదువుతున్నాడు,ఎంతో మంది తల్లిదండ్రుల బాధపడే అంశం. కుటుంబ సభ్యులు ఒకరిని కోల్పోతే ఎలా ఉంటుందని అందరికి తెలుసు.

గత ఎనిమిది నెలల్లో  36 మంది చనిపోయారు. హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల బాగుగోలు ప్రభుత్వమే చూసుకోవాలి. రాష్ట్రంలో 500 మంది విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత ప్రభుత్వంలో ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రంలో 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం. ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగితే వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురుకులాలపై కొత్తగా కమిటీ వేసి కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వాన్ని అందిస్తాం. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి.  హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో ఆహారం ఇవ్వండి. ప్రతి జిల్లా నుంచి కలెక్టర్లు గురుకులాలను దత్తత తీసుకొని వారానికి ఒకసారి పర్యవేక్షించాలని సూచించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news