అప్పు తెచ్చి రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సంకేతం ఇస్తుంది : జయప్రకాశ్ నారాయణ

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఇప్పటికే కొన్ని గ్యారెంటీలు అమలు కాగా.. మరికొన్ని అమలు చేసేందకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలోనే ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రుణం వరకు రుణమాఫీ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రెండు దశల్లో రుణమాఫీ చేసింది. ఆగస్టు 15న మూడో దశ రుణమాఫీ చేయనున్నారు.

రుణమాఫీ పై జయప్రకాష్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పు తెచ్చి రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సంకేతం ఇస్తుంది అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి బ్యాలన్స్ చేసింది కాబట్టి తెలంగాణ, హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి అయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని హామీలు ఇచ్చింది. రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అప్పు తెచ్చి, చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ అప్పు మొత్తం ఎవరి మీద భారం పడుతుంది. రైతులకు ఇలా మాఫీలు చేస్తూ  సోమరులని చేస్తున్నారని పేర్కొన్నారు జయప్రకాశ్ నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news