ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో EWS కోటా కింద సీట్ల కేటాయింపు జీఓ నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ జీఓను సవాలు చేస్తూ మెడికల్ విద్యార్దులు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో మెడికల్ సీట్లను పెంచి EWS కోటా కింద భర్తీ చేయాలని వాదనలు వినిపించారు పిటిషనర్ అడ్వకేట్ ఠాకూర్. ప్రైవేట్ కళాశాలల్లో సీట్లను పెంచకుండానే EWS కింద సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం జిఓ జారీ చేసిందని పిటిషనర్ లాయర్ పేర్కొన్నారు. అలాగే ఈ జీఓ నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలనీ కోరారు పిటిషనర్.
అయితే ఈ జీఓ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను వచ్చే 6 వారాలకి వాయిదా వేసింది. సీట్లు పెంచకుండా EWS కోటా కింద సీట్లు కేటాయిస్తే ఓపెన్ కేటగిరీ విద్యార్దులు నష్టపోతారని కోర్టు దృష్టికి తీసుకొని వెళ్లారు పిటిషనర్.