దిశా ఎన్ కౌంటర్ చేసినా మార్పు రాలేదు.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

-

మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కొప్పుల రాజు, వాకాటి కరుణ వంటి ఉన్నాతాధికారుల సూచనలతో స్త్రీనిదిని ఏర్పాటు చేశారని మంత్రి సీతక్క తెలిపారు. స్త్రీ నిధి సర్వసభ్య సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ మార్గదర్శకంలో మహిళా సాధికారత కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. మహిళా సంఘాలు అంటే సమాజంలో గౌరవం పెరిగింది. గ్రామీణ స్థాయిలో 63 లక్షల మందిని మహిళా సభ్యులుగా చేర్పించారు. ఆర్థిక అంశాలతో పాటు మహిళా రక్షణ కోసం మహిళా సంఘాలు పనిచేయాలి.

వేధింపుల నుంచి మహిళలకి మహిళా సంఘాలు విముక్తి కల్పించాలి. ఆర్థిక భద్రతతో పాటు సామాజిక భద్రత కల్పించేలా మహిళా సంఘాల పని చేయాలి. మహిళల్లో అభద్రత పోగొట్టేలా త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ఆడవాళ్లు లేకుంటే సృష్టి లేదు అనే ఆలోచన పెరిగేలా అవగాహన కార్యక్రమాలు చేపడతాం.ఎన్ కౌంటర్లతో మార్పు రాదు.. వరంగల్ దిశ ఎన్ కౌంటర్లతో సమాజం మారలేదు. అందుకే పాఠశాల గదుల్లోనే మార్పు మొదలయ్యేలా పాటాలు బోధిస్తామని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రభుత్వం చేసే కృషికి మహిళా సంఘాలు తోడుగా నిలవాలి. లక్షల మంది మహిళలను కాంగ్రెస్ లక్ష్యాధికారులను చేసింది. అలాగే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. సమాజం సంతోషంగా ఉండాలంటే కుటుంబం సంతోషంగా ఉండాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news