అప్పుడు సూపర్ సిక్స్.. ఇప్పుడు సూపర్ చీట్..!

-

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచిత్ర పరిస్తితి చూస్తున్నాం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మొదట సూపర్ సిక్స్ ని అధికారంలోకి వస్తె అమలు చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక సూపర్ చీట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. తెలంగాణలో తన పార్టీ అధికారంలోకి రావాలని ఏపీని ఆ రాష్ట్రానికి ఇవ్వాలని చూస్తున్నారు. అన్నా క్యాంటీన్ ల ఏర్పాటుకి మేము వ్యతిరేఖం కాదు.

కానీ అన్నా క్యాంటీన్ లో ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసు. అన్నా క్యాంటీన్ లకు పచ్చ రంగు వేశారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టడం లేదని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే చంద్రబాబు నైతిక విలువలకు కట్టుబడి పోటీ పెట్టలేదని టీడీపీ నేతలు డబ్బా కొడుతున్నారు. కానీ చంద్రబాబు రాజకీయ జీవితం అంతా అనైతికం. చంద్రబాబు కి నైతికత వుంటే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చినప్పుడే పోటీ పెట్టడం లేదని చెప్పవచ్చు కదా. చంద్రబాబు లాంటి వాళ్ళు నైతికత గురించి మాట్లాడటం సరికాదు అని అంబటి రాంబాబు తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news