పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు.. అనుమానితులపై స్పాట్​ డ్రగ్​ టెస్టింగ్​

-

రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర పోలీసులు, టీన్యాబ్, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా పని చేస్తోంది. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ రాష్ట్రంలోకి మత్తు పదార్థాలు రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల డ్రగ్స్ సరఫరా, వినియోగానికి కేరాఫ్ గా మారిన పబ్బులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు హైదరాబాద్​లోని 12పబ్​లల్లో పోలీసులు తనిఖీలు చేట్టారు. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో 12 బృందాలు పాల్గొన్నాయి. హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లో సోదాలు నిర్వహించి అనుమానితులపై స్పాట్ డ్రగ్ టెస్టింగ్​ చేశాయి.

డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ డ్రైవ్​లో భాగంగా ఇటువంటి తనిఖీలు మరిన్ని జరుగుతాయని అధికారులు తెలిపారు. పబ్ సిబ్బంది ఎవరైన డ్రగ్స్​ సంబంధిత నేరాలకు పాల్పడితే ఆ పబ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్​లో పబ్స్​పై ఎల్లప్పుడూ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news