సరిలేరు నీకెవ్వరు ట్రైలర్… స్పెషల్ రివ్యూ మీకోసం !!

-

Sarileru Neekevaru Movie Trailer : సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరబాద్ లోని ఎల్‌బి స్టేడియం లో అంగరంగ వైభవం గా జరిగిన సంగతి తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధి గా వచ్చిన ఈ ఫంక్షన్ కి మెగా ఫామిలీ అభిమానులతో పాటు మహేశ్ అభిమానులతో ఈ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది.

మహేశ్ బాబు – మెగాస్టార్ లని ఒకే చోట చూడడం తో సినిమా ఇండస్ట్రి వారికి కూడా రెండు కళ్ళూ సరిపోలేదు అనే చెప్పాలి. మహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘సరిలేరు నీకేవ్వరు’ సినిమా కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. F2 లాంటి ఫ్యామిలీ కామెడీ బ్లాక్ బస్టర్ తరవాత అనిల్ మహేశ్ కోసం సూపర్ స్క్రిప్ట్ ని రెడీ చేశాడు .. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా విడుదల ఐన ఈ సినిమా ట్రెయిలర్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

 

మహేశ్ బాబు బాడీ లాంగ్వేజి పూర్తిగా మార్చే ప్రయత్నం చేశాడు అనిల్ రావిపూడి .. ట్రెయిలర్ మొదలు అవ్వడం తోనే ట్రైన్ సీన్ లతో కడుపుబ్బా నవ్వించే కామెడీ ఉంది అని ప్రూవ్ చేశాడు అనిల్. దాంతో పాటు కావాల్సినంత మాస్ సీన్ లు , మహేశ్ తరహా డైలాగులు .. విజయశాంతి మహేశ్ ల మధ్య ఎమోషన్ .. ప్రకాష్ రాజ్ కి వార్నింగ్ సీన్ లు ఇలా అనిల్ ఊర నాటు మాస్ రేంజ్ లో తీశాడు అని అర్ధం అవుతోంది..

ప్రస్తుతం ఈ సినిమా ట్రెయిలర్ యూట్యూబ్ లో నెంబర్ 1 కి చేరింది .. ఆద్యంత ఫన్ తో పాటు మహేశ్ ని మాస్ గా చూపిస్తున్న అనిల్ రావిపూడి .. తాను ఈ సినిమా తో చెప్పదలచుకుంది ఎంతో క్లియర్ గా ట్రెయిలర్ తోనే చూపించాడు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు కిరాక్ అనిపించే కామెడీ, మహేశ్ బాబు ఫైట్స్ ఈ సినిమా కి బలం గా నిలుస్తాయి అనేది క్లియర్ గా అర్ధమయ్యేలా ట్రెయిలర్ కట్ చేశారు .. ఇక ఫాన్స్ కి సంక్రాంతికి పండగే అనమాట !!

Read more RELATED
Recommended to you

Latest news