కర్ణాటకలో ప్లాన్ బి అమలు చేస్తున్న కాంగ్రెస్.. కీలక నిర్ణయం దిశగా అడుగులు

-

కర్ణాటక రాజకీయంపై కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. సిద్ధరామయ్యకు అండగా ఉంటూనే.. ప్లాన్ బి రెడీ చేసుకుంటుంది.కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సేఫేనా.. ప్రస్తుతం ఇదే చర్చా కన్నడ కాంగ్రెస్లో జోరుగా నడుస్తోంది.. వరుసగా చుట్టుముట్టిన ముడా, వాల్మీకి స్కామ్ లతో సిద్ధరామయ్య పదవి ఊడుతుందని ప్రచారం ఊపందుకుంది.. దింతో ఏఐసీసీ అలెర్ట్ అయింది. అగ్ర నేతలు భేటీ అయ్యారు. కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వెయ్యబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా కేసుల్లో కూరుకుపోతున్నారు.. ముడా, వాల్మీకి స్కామ్ లు ఆయన సీఎం పీఠానికి ఎసరు తెచ్చేలా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా వాల్మీకి స్కాం కర్ణాటకతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సైతం ముచ్చెముటలు పట్టిస్తోందట. కర్ణాటక ప్రభుత్వ అకౌంట్ నుంచి 180 కోట్లు దారిమళ్లాయని సీఎం సిద్ధరామయ్య ఒప్పుకున్నారు. తెలంగాణలోని తొమ్మిది అకౌంట్లకు 45 కోట్లు బదిలీ అయ్యాయని.. స్కాము కు సంబంధించి విచారణ ప్రారంభం కాగానే, వాల్మీకి కార్పొరేషన్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.. లోక్సభ ఎన్నికల సమయంలో.. వాల్మీకి స్కాం కి సంబంధించిన డబ్బులని కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టిందంటూ అయన ఆరోపణలు చేస్తున్నారు.. దింతో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడింది.

సీఎం సిద్ధరామయ్య వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండడంతో.. సీఎం కుర్చీపై కీలక నేతలు కన్నేశారట. తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.. సిద్ధారామయ్యని సీఎం కుర్చీ నుంచి దింపేయాల్సి వస్తే.. ఎవర్ని సీఎం చేయాలనే దిశగా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలు చేస్తోందట.. సిద్ధరామయ్యకు తమ మద్దతు ఉంటుందని చెబుతూనే… ప్లాన్ బి ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news