సమంత షాకింగ్ పోస్ట్.. మనకూ ఆ కమిటీ కావాలంటూ..!

-

మలయాళ సినీరంగంలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదికలో 290 పేజీలు సమర్పించింది. ఈ నివేదిక అక్కడి ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ నివేదికలో మహిళలు లైంగిక వేధింపులతో పాటు రెమ్యూనరేషన్ లో వివక్ష, లోకేషన్లలో కనీస సౌకర్యాలలేమితో ఇబ్బందులు పడుతున్నారని కమిటీ పేర్కొంది. ఈ నివేదిక కేవలం మలయాళ పరిశ్రమలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ నివేదిక వెలువడిన తర్వాత సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వారు లేవనెత్తిన ఆరోపణల ఆధారంగా తదుపరి విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఇప్పటికే చాలామంది నటీమణులు బయటకువచ్చి తమకు జరిగిన చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటున్నారు. అయితే ఈ కమిటీపై ఇప్పటికే చాలామంది నటులు, నటీమణులు కూడా మాట్లాడారు.

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ హేమ కమిషన్ రిపోర్ట్ పై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా హేమా కమిటీ రిపోర్ట్ ని స్వాగతించింది సమంత. ఈ కమిటీ పనితీరును ఆమె ప్రశంసించింది. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసిసి) నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని తెలిపింది. ” కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసిసి) అద్భుతమైన పనితీరును నేను ఎన్నో సంవత్సరాలుగా గమనిస్తున్నాను.

దీని సహకారం వల్లే హేమా కమిటీ నివేదిక ఇచ్చింది. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులు దీని ద్వారా బయటకొచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల పైన మేము జస్టిస్ హేమా కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలకు మద్దతుగా నిలిచేందుకు 2019లో నెలకొల్పిన ” ది వాయిస్ ఆఫ్ ఉమెన్” కూడా డబ్ల్యూసిసి గ్రూప్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి. టాలీవుడ్ లో మహిళల సమస్యలపై పోరాడేందుకు రూపొందించిన ఈ సబ్ కమిటీ నివేదికను పబ్లిష్ చేయడానికి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం” అని సమంత ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news