అమరావతిని రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలపై రైతులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మంగళవారం వాళ్ళు జాతీయ రహదారిపై దిగ్బంధనం కి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే దానిని అడ్డుకోవడానికి గాను,
పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. తెలుగుదేశం ఎంపీలు గల్లా జయదేవ్, కేసినేని నానీ ఇళ్ళ వద్ద భారీగా మొహరించారు. అలాగే కొంత మంది తెలుగుదేశం నేతలను ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్ లు చేసారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ని హౌస్ అరెస్ట్ చేసారు.
విజయవాడ నగరంలో స్థానిక నేతలను పోలీసులు గృహ నిర్భంధం చేసారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద్ , నక్కా ఆనంద్ బాబు ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ఇక యువ నేతలు కొంత మందికి నోటీసులు ఇచ్చారు. ఇక ఎక్కడికక్కడ తెలుగుదేశం కార్యకర్తలను దిగ్బంధనానికి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో భారీగా పోలీసులు మొహరించారు.