వరదలు వల్ల విజయవాడకు ఉహించని నష్టం జరిగింది. కానీ సీఎంగా చంద్రబాబు అనుభవం వల్ల తక్కువ నష్టం జరిగింది అని అన్నారు మంత్రి పార్థసారథి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇంటి ఇంటికి ఆహారం సరఫరా చేస్తున్నాం. ప్రతి వార్డు సచివాలయానికి ఒక అధికారిని నియమించాం. 180 వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. ఫైరింజన్లు ద్వారా ఇంటిలోకి వచ్చిన బురదను తొలగిస్తున్నాం. మందులు కూడా సరఫరా చేస్తున్నాం అని పేర్కొన్నారు.
అలాగే శానిటేషన్ కోసం 4 వేల మంది సిబ్బందిని అన్ని మున్సిపాల్టీల నుంచి రప్పించాం. పెద్ద ఉపద్రవం వస్తే ప్రజలకు సహకారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ జిడ్డు జగన్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వరద ముంపులో చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది. టీడీపీ, జనసేన నేతలు అందరూ ఆహారం, మంచినీరు, ఆర్థిక సాయం వంటిని ప్రజలకు చేశారు అని తెలిపారు మంత్రి.