బిజేపీ తలనొప్పిగా మారిన హర్యానా మాజీ మంత్రి వ్యాఖ్యలు..

-

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి.. క్రేజీవాల్ విడుదల తర్వాత అది మరింత పీక్స్ కు చేరుబోతుంది.. త్రిముఖ పోటీ తప్పదనే చర్చ పొలిటికల్ సర్కిల్ లో జరుగుతోంది.. ఇదే సమయంలో బిజేపీ సీఎం రేసులో తాను కూడా ఉన్నానంటూ మాజీ మంత్రి అనీల్ విజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి.. నేతలను ఏకతాటిమీదకు తీసుకొచ్చి.. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్న బిజేపీకి.. ఇప్పుడు అనీల్ రూపంలో కొత్త తలనొప్పులు స్టాటయ్యాయనే టాక్ వినిపిస్తోంది..

కాంగ్రెస్, ఆప్ లు కలిసి పోటీ చేసి.. బిజేపీని ఓడించాలని తొలుతా ఇరు పార్టీలు సిద్దమయ్యాయి.. కానీ సీట్ల సర్దుబాటులో ఇబ్బంది రావడంతో ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి.. ఓట్లు చీలితే తాము అధికారంలోకి వస్తామని బిజేపీ చెబుతోంది.. హర్యాన అసెంబ్లీలో 90 సీట్లకుగాను కాంగ్రెస్ పార్టీ 89 చోట్ల బరిలోకి దిగుతుండగా ఒక స్థానాన్ని సిపిఎంకు కేటాయించింది. ఆప్ 40 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. బిజేపీ అధికారంలోకి రావడం ఖాయమని క్యాడర్ భావిస్తున్న సమయంలో మాజీ మంత్రి వ్యవహారం చర్చలకు దారితీస్తోంది.. ఇప్పటికే బిజేపీ తన సీఎం అభ్యర్దిని ప్రకటించింది కూడా..

సీనియర్‌ బీజేపీ నేత, మాజీ మంత్రి అనిల్‌ విజ్‌ సీఎం చైర్ తనదేనంటూ మాట్లాడుతున్నారు.. తాను పార్టీలో సీనియర్‌నని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే తాను సీఎం రేసులో ఉంటానని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.. అనిల్‌ విజ్‌ ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.. దీంతో తాను సీఎం పదవికి అర్హుడని, పార్టీ తన గురించి ఆలోచించాలని అనిల్ కోరుతున్నారు.. అంబాలా కంటోన్మెంట్ నుంచి బరిలో ఉన్న.. ఖట్టర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.. ఎన్నికల వ్యూహాల్లో బిజీగా ఉన్న బిజేపీకి.. ఆయన వ్యాఖ్యలు తలనొప్పులు తీసుకొచ్చేలా ఉన్నాయనే చర్చ పార్టీలో జరుగుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news