రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడవ్..? : హరీశ్ రావు

-

ఇవాళ సెప్టెంబర్ 17 తెలంగాణలో ప్రజా పరిపాలన దినోత్సవం అని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ  జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా నిజాం నిరంకుశ పాలన అంటూ.. తన స్పీచ్ ను ప్రారంభించారు. గత ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో అధికంగా అప్పులు చేసిందని వెల్లడించారు.

తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. ముఖ్యంగా ఎంత సేపు అప్పులు అప్పులు మాట్లాడుతున్నవు కదా..  మరి కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడవు అని ప్రశ్నించారు.  తెలంగాణ ఏర్పడిన నాడు 2013-14లో మన తలసరి ఆదాయం రూ.1,12,162.  ఇవాళ రూ. 3,47,229కి పోయింది.  దేశంలో నంబర్ 1 తెలంగాణ GSDP రాష్ట్రం ఏర్పడిన నాడు 4,51,000 కోట్లు ఉంటే ఈ నాడు 14,63,000 కోట్లకు పెంచారు.  దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణను అగ్ర బాగాన నిలబెట్టిన కేసీఆర్ గురించి, తలసరి ఆదాయం గురించి నీకు నోరు ఎందుకు రాదు అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news