వందరోజుల్లో ఆ పూర్తి చేస్తాం : బీసీ జనార్ధన్ రెడ్డి

-

ఎన్ హెచ్ ఓ కింద 6,585 కోట్ల రహదారి పనులకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని అన్నారు ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి. మొత్తం 348 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరుగుతుంది. 31 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారిగా స్థాయి పెంచాలని కేంద్రాన్ని కోరాం. గడచిన ఐదేళ్ళుగా రహదారుల గుంతలు పూడ్చకుండా వదిలివేశారు. ఆ భారం మా ప్రభుత్వం పైనే పడింది. 290 కోట్లతో రోడ్ల మరమ్మత్తు చేసేందుకు సీఎం అదేశాలు జారీ చేశారు. ఆ కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రాలేదు.

ఇక వర్షాలు తగ్గిన వెంటనే పనులు మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. నవంబర్ నుంచి పనులు మొదలు పెట్టి వందరోజుల్లో పూర్తి చేస్తాం. కొన్ని రాష్ట్ర రహదారులను కూడా పీపీపీ విధానంలో అబివృద్ధి చేయాలని నిర్ణయించాం. మొత్తం 2 వేల కిలోమీటర్ల మేర ఇలా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంది. పీపీపీ విధానంలో టోల్ వసూలు చేసి రహదారుల నిర్వహణ చేపడతాం. అమరావతి అనంతపురం ఎక్స్ ప్రెస్ హైవే అదే రూట్ మ్యాప్ ఉంటుంది అని బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news