శాసనమండలి BRS పక్ష నేతగా మధుసూదనాచారి..!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్-అధికార కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడూ కేటీఆర్, హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. ప్రభుత్వం తరుపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు సమాధానాలు చెబుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి నూతన పీసీసీ ప్రెసిడెంట్ అధ్యక్షుడిని ఎన్నుకున్న విషయం తెలిసిందే. నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా  శాసనమండలి BRS పక్ష నేతగా మధుసూదనాచారిని ఎన్నుకుంది. ఈ సందర్భంగా మధుసూదనచారి మాట్లాడుతూ..  బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీ ని చేసే దమ్ముందా..? అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించాడు. కాంగ్రెస్ లో బీసీ ని ముఖ్యమంత్రి చేసే దమ్ముందా అని నేను ప్రశ్నిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి లో చెప్పిన విదంగా బీసీ డిక్లరేషన్ అమలు చేయడం లేదన్నారు. అది మరిచి పోయేందుకే మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షుడిగా చేశారు. కాంగ్రెస్ చరిత్ర మొత్తం బీసీ లను ఓటర్లు గానే చూసింది. కాంగ్రెస్ పార్టీ చెప్పిన బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు మధుసూదనాచారి.

Read more RELATED
Recommended to you

Latest news