చవకబారు విమర్శలు మానుకో.. కేటీఆర్ కి ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరిక

-

చవకబారు విమర్శలు మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. పదేళ్ల పాటు ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ స్కీములను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించి.. ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గు చేటని ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. మీ హయాంలో ఆసుపత్రులకు బకాయిలు అందించకుండా చేశారని.. ప్యాకేజీల రేట్లు రివైజ్ చేయకుండా ఆరోగ్య శ్రీ పేషెంట్లకు వైద్యం అందకుండా చేశారని, ఈసీహెచ్ కింద ట్రీట్ మెంట్ కోసం పోయిన ఉద్యోగులు పెన్షనర్లను కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు అవమానిస్తుంటే చోద్యం చూశారా..? అని ధ్వజమెత్తారు.

పదేళ్లు మోసం చేసింది చాలదన్నట్టు ఎన్నికల ముందు హడావుడి చేసి.. ఓ డమ్మీ జీవో ఇచ్చి మరో సారి ఉద్యోగులను మోసం చేసే కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు చవకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే రూ.5లక్షలలోపు ఉన్న ఆరోగ్య పరిమితిని రూ.10లక్షల వరకు పెంచామని గుర్తు చేశారు. పదేళ్లలో మీరు చేయలేకపోయిన ఫ్యాకేజీల రివిజన్ ను 6 నెలల్లోనే పూర్తి చేశామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news