నెయ్యి కల్తీ జరిగినట్టు సాక్ష్యం ఉందా..? : సుప్రీం కోర్టు

-

తిరుమల లడ్డు కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు తొలుత ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ప్రతిపక్ష, కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రెస్ మీట్ లో ఈవో ధర్మారావు కల్తీ నెయ్యి వాడలేదని చెప్పారు. రిపోర్టులో మాత్రం కల్తీ జరిగిందని.. జంతువుల కొవ్వు కలిసిందని వివరించారు. అయితే ఇవాళ సుప్రీంకోర్టులో లడ్డూ వివాదం పై వాదనలు జరిగాయి.

ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన అంశం అని సుప్రీంకోర్టు పేర్కొంది. నెయ్యి కల్తీ జరిగినట్టు సాక్ష్యం ఉందా..? అని సుప్రీం కోర్టు ప్రశ్నించారు. ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ పరీక్షలకు పంపించారా..? లడ్డు కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్స్ పంపించలేదు. మైసూర్, ఘజియాబాద్ ల్యాబ్ ల నుంచి ఎందుకు సెకండ్ ఒపినీయన్ తీసుకోలేదని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ల్యాబ్ రిపోర్టులో ఉన్న నెయ్యితో లడ్డూ తయారు చేసినట్టు ఆధారాలు లేవు. లడ్డులను ముందుగానే ఎందుకు పంపలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. సిట్ దర్యాప్తు జరగకుండానే ముఖ్యమంత్రి కల్తీ జరిగిందని ఎలా చెప్పారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. విచారణ గురువారానికి వాయిదా వేసింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news