చంద్రగ్రహణానికి తోడేలుకి సంబంధం ఏంటి…? ఈ ప్రశ్న ఆశ్చర్యంగా ఉంది కదూ…? శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తోడేలు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 10;37 నిమిషాలకు మొదలయ్యే చంద్రగ్రహణం, 12.30కి పూర్తిస్థాయికి చేరి… జనవరి 11 తెల్లవారు జాము 2.42కి ముగుస్తుంది. ఈ సమయంలో చందమామకు, సూర్యుడికి మధ్యలో భూమి రావడం వలన సూర్యుడి కాంతి చంద్రుడిపై పడకపోవడమే గ్రహణం.
మన తెలుగు రాష్ట్రాల్లో ఇది కనపడే అవకాశాలు తక్కువ. ఇతర రాష్ట్రాల్లో దీనిని చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలు. మనదేశంతో పాటుగా ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్ ఖండాల దేశాల్లోని ప్రజలు చంద్రగ్రహణం చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూర్యగ్రహణం చూడాలి అంటే ప్రత్యేక గ్లాసెస్ అవసరం. కాని చంద్రగ్రహణం కోసం అవేమి అవసరం లేదు. 2020లో మొదటి గ్రహణం ఇదే.
దీని తర్వాత జూన్ 5, జులై 5, నవంబర్ 30న కూడా చంద్ర గ్రహణాలు రానున్నాయి.. ఇదిలా ఉంటే ఈ చంద్ర గ్రహణాన్ని ఇంగ్లీష్‌లో ” ఉల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్” అని పిలుస్తున్నారు. అది ఎందుకు అంటే, ప్రస్తుతం అమెరికాలో చలి ఎక్కువగా ఉంది. విపరీతంగా మంచు పడటంతో, అందువల్ల జంతువులకు ఆహారం దొరకదు. తోడేళ్లైతే ఆహారం కోసం గ్రామాల శివార్లలోకి వచ్చి గట్టిగా రావడంతో, జనవరిలో కనిపించే చంద్రుణ్ని ఊల్ఫ్ మూన్ అని పిలుస్తారు.