రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. రాజ్ పాకాల స్వంత ఇళ్ళు కట్టుకుని గృహప్రవేశం చేసుకున్నారు. కేటీఆర్ ప్రభుత్వంపై ఉధృతంగా ముందుకు వెళ్తున్నారు. టార్గెట్ చేసి రచ్చ చేస్తున్నారు. అసలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు..?వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్‌లో నాలుగు బాటిల్స్ ఎక్కువ ఉన్నాయని తెలిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్.
ఆబ్కారీ, పోలీసు వాళ్ళు పంచనామా చేసి నాలుగు బాటిల్స్ ఉన్నాయని చెప్పారు. వ్యక్తిని, వ్యక్తి కుటుంబాన్ని టార్గెట్ చేయడం రాజకీయాల్లో పద్ధతి కాదన్నారు. జన్వాడ ఫార్మ్ హౌస్ ఎక్కడ ఉంది రాజ్ పాకాల ఇల్లు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కుట్ర చేయాలనే పోలీసులు సోదాలు అంటున్నారు. టీఆర్ బావమరిది కాబట్టి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శల, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ వ్యక్తిగత కక్షలు రాజకీయాల్లో చూస్తున్నాం. రాజకీయ పార్టీపైన, కుటుంబం పైన బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం పోలీసులు చేశారు. దీని వెనుక బలమైన కుట్రకోణం ఉందని తలసాని తెలిపారు.