కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ బావమరిది స్వంతంగా ఫార్మ్ హౌస్ కట్టుకుని గృహప్రవేశం చేశారు. జన్వాడలో ఏం దొరకలేదు, గచ్చిబౌలిలో రాజ్ పాకాల ఇంట్లో సెర్చ్ చేస్తున్నారు. కేటీఆర్ పైన కక్ష తీర్చుకునేందుకు కుటుంబ సభ్యలను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్ పాకాల ఇంట్లోకి లాయర్లను పంపించాలన్నారు.
పోలీసులు రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లి ఏదో ఒకటి పెట్టి కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు మానిటరింగ్ చేస్తున్నట్లు మాకు సమాచారం ఉందని తెలిపారు. కేటీఆర్ పైన ప్రభుత్వం కక్షపూరితంగా ఉందని వెల్లడించారు.