2025లో జనంలొోకి కేసీఆర్.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

రేవంత్‌ రెడ్డి పాలనకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎక్స్ వేదికగా #AskKTR సెషన్ ద్వారా ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకొనే కేటీఆర్.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మళ్లీ అందుబాటులోకి రానున్నారని చెప్పినట్టుగానే స్పందించారు. చాలా రోజుల తర్వాత  మరోసారి చిట్ చాట్‌కు సిద్ధమయ్యారు. ఇక కేటీఆర్‌ తో ముచ్చటించాలనుకునే వారు #AskKTR హాష్ ట్యాగ్‌ ఉపయోగించి ఈ సెషన్‌లో పాల్గొనండి అంటూ స్వయంగా కేటీఆర్‌ ప్రకటించారు.

వచ్చే ఏడాది నుంచి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని కేటీఆర్ తాజాగా వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్యం, ఆయన బయటకు ఎందుకు రావడం లేదనే ప్రశ్నకు #AskKTR లో స్పందించారు. ” కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ప్రతిరోజు ఆయన మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. బాద్యతయుతమైన ప్రతిపక్ష నేతగా, 420 హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వానికి సమయం ఇస్తున్నారు. 2025 నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు. కుదిరితే ఇంకా ముందే దిగుతారు” అంటూ చెప్పారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news