అప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడెందుకు తగ్గింపు.. ప్రభుత్వం పై కేంద్రమంత్రి ఆగ్రహం

-

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల తగ్గింపు పై మండిపడ్డారు. తెలంగాణలో మరిన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు జిల్లాలు, మండలాల పునర్వవస్థీకరణ పై సమీక్షిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదిక పై ఆయనను ప్రశ్నించారు.

జిల్లా, మండలాల పునర్విభజన చేస్తామని ప్రభుత్వం హామి ఇచ్చి ఇప్పుడు జిల్లాల తగ్గింపు పై ఎందుకు ఆలోచిస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలోని జిల్లాలను ఎందుకు తగ్గించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది జిల్లాల నుంచి 33 జిల్లాలుగా తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం విస్తరించింది. రాజకీయ అవసరాల మేరకే బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని జిల్లాలను ఏర్పాటు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన విషయం విధితమే. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యస్థీకరణ అవసరమైతే.. వాటి సంఖ్యను తగ్గించాలని సూచించేందుకు న్యాయ కమిషన్ నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news