చంద్రబాబుకు ముద్దుపెట్టుకున్న మహిళా..!

-

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వరుసగా అమలు చేస్తూ ప్రజల్లో తిరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అనూహ్య పరిణామం ఎదురైంది. పర్యటన సమయంలో ఫొటో దిగేందుకు వచ్చిన ఓ మహిళ ఆమె ప్రేమ పూర్వకంగా చేసిన పని వైరల్‌గా మారింది. చంద్రబాబు దగ్గరకు వచ్చి పుష్పగుచ్ఛం ఇచ్చి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అనంతరం అనూహ్యంగా చంద్రబాబును రెండు చేతులు పెట్టి ముద్దు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె చేసిన పనికి సీఎం నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో సీఎం చంద్రబాబు  పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెన్నెలపాలెంలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం తిరిగి నడుచుకుంటూ తన కాన్వాయ్‌ వద్దకు వెళ్తుండగా ఓ మహిళ అకస్మాత్తుగా చంద్రబాబు వద్దకు దూసుకొచ్చింది. ముఖ్యమంత్రిని కలవాలని చెప్పి దూసుకురావడంతో చంద్రబాబు కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో భద్రతా సిబ్బంది అనుమతించారు.

Read more RELATED
Recommended to you

Latest news