ఏపీలో వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్న వేళ మహిళలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినా పెద్దగా ఫలితాలు కనిపించడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో మరో అత్యాచార ఘటన జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికపై తిరుపతిలో కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
యలమందలో స్కూల్ ముగించుకొని ఒంటరిగా ఇంటికి వెళ్తున్న బాలికను కొందరు దుండగులు అడ్డగించి ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. గాయాలతో పడి ఉన్న బాలికను స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.