రంగారెడ్డి జిల్లాలో భూముల ఆక్రమణపై ఈడీకి కొనసాగుతున్న ఫిర్యాదులు..!

-

రంగారెడ్డి జిల్లాలో భూముల అన్యాక్రాంతం పై ఈడీకి వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. నాగిరెడ్డి పల్లి 180సర్వే నెంబర్ లో 26ఎకరాల 30గుంటలు అన్యాక్రాంతం జరిగింది అని ఈడీకి ఫిర్యాదు అందింది. నాగారంలోని 194 సర్వేనెంబర్ భూమిని 180లో చూపించి కాజేశారని.. ఏడీ సర్వే తప్పుగా చూపి భూములు కాజేశారని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమంగా సురేష్ ముదిరాజ్ అనే వ్యక్తికి భూములు కట్టబెట్టారని ఆరోపణలు వస్తున్నాయి.

సురేష్ ముధిరాజ్ నుంచి గుంటల్లో భూములు కొనుగోలు చేసిన పలువురు ఐపిఎస్, ఐఏఎస్ అధికారులు ఒక్కొక్కరు 8,16, 20 గుంటల చొప్పున 31మంది అధికారులు, కుటుంబాల పై రిజిస్ట్రేషన్ లు జరిగాయి అని.. భూమి కొనుగోలు చేసిన వారిలో సోమేష్ కుమార్, నవీన్ మిట్టల్, రాజీవ్ రతన్, వికాస్ రాజ్, అంజనీకుమార్, శివధర్ రెడ్డి, మహేంధర్ రెడ్డిల కుటుంబాలు ఉన్నట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు. అయితే అప్పటి రెవిన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news