వచ్చే ఎన్నికల్లో మనదే విజయం : KCR

-

వచ్చే ఎన్నికల్లో మనదే విజయం అంటూ BRS పార్టీ అధినేత KCR ధీమా వ్యక్తం చేసారు. అయితే 2023 లో జరిగిన ఎన్నికల్లో ఓడిన తర్వాత KCR మీడియా ముందుకు రావడం లేదు అనేది అందరికి తెలిసిందే. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటూ పార్టీని నడిపిస్తున్నారు KCR. అయితే తాజాగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వచ్చిన BRS MLAలతో సమావేశం అయిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. ఈ 11 నెలల కలాలంలో ప్రజలకు వారు ఏం కోల్పోయారు అనేది తెలిసిందే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తప్పకుండ మనమే విజయం సాధిస్తాం. ఇప్పుడు ప్రజలు మనపై నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో పార్టీ నాయకులూ అందరూ కష్టపడి పని చేయాల్సి ఉంటుంది అని సూచనలు చేసిన పార్టీ నేత.. ఈ ప్రభుత్వం చేస్తున్న అరెస్టులకు అలుసు భయపడేది లేదు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news