కరెంట్ సరఫరా చేతకాక రేవంత్ మరో తుగ్లక్ చర్య చేపట్టారు : కేటీఆర్

-

లోడ్ పెరిగిందంటూ ట్రాన్స్‌ఫార్మర్ల భారం అపార్ట్‌మెంట్ వాసులపై వేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కరెంట్ నిర్వహణ, సరఫరా చేతకాక ప్రజలను ఇబ్బంది పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి మరో తుగ్లక్ చర్యకు తెర లేపారు అని అన్నారు. దీంతో ఒక్కో అపార్ట్‌మెంట్‌లో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం రూ. 3 లక్షలు కావాలి. మధ్యతరగతి కుటుంబాల పై ఇది భరించలేని భారమవుతుంది అని ఆయన అన్నారు.

అయితే ఒక్క హైదరాబాద్ నగరవాసుల పైనే అదనంగా రూ. 300 కోట్ల భారం పడుతుంది అని తెలిపిన కేటీఆర్.. పెరిగిన విద్యుత్ లోడ్‌ను సరిగ్గా నిర్వర్తించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని తెలిపారు. లోడ్ పెరిగిందని కారణం చూపుతూ అపార్ట్‌మెంట్ వాసులపై భారం వేస్తామంటే ఊరుకునేది లేదు అని పేర్కొన కేటీఆర్.. ప్రభుత్వమే కొత్తగా అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్‌ లను ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news