దీక్ష దివస్ కోసం కరీంనగర్ కు కేటీఆర్..!

-

దీక్ష దివాస్ కార్యక్రమం కోసం ఈనెల 29న కరీంనగర్ కు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివాస్ నిలుస్తుంది 2009,నవంబర్ 29వ తేదీన BRS అధ్యక్షులు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసింది అని ఆయన అన్నారు.

అలాగే దీక్షకు వెళ్లే ముందు తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండవర్ణాల తెలంగాణ ప్రజలను ఏకం చేసింది. ఈ దీక్ష యావత్ భారత దేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, చరిత్రలో తొలిసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసి దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చింది అని కేటీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news