హైదరాబాద్ బిర్యానీలో తీగ ఉండటం చూసి ఆర్డర్ ఇచ్చిన యువకుడు షాక్ అయ్యాడు. ఈ ఘటన నగరంలోని కూకటపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కూకటపల్లిలో నివాసం ఉండే శ్రీనివాస్ అనే యువకుడు జోమాటో యాప్ ద్వారా బిర్యాని, కర్డ్ రైస్ ఆర్డర్ ఇచ్చాడు. బిర్యాని తింటూ ఉండగా నోట్లో పంటి కింద గట్టిగా తగలడంతో బయటకు తీసి చూడగా అది ఇనుప తీగ అని గుర్తించాడు.
దీనితో వెంటనే జోమాటో కి ఫిర్యాదు చేసాడు. వెంటనే డిస్కౌంట్ కూపన్ ఇచ్చింది జోమాటో. కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ క్షమాపణలు కూడా చెప్పింది. అయినా సరే అతను వెనక్కు తగ్గలేదు. వంటనే శ్రీనివాస్ జీహెచ్ఎంసీ యాప్ ద్వార ట్విట్టర్‌లో బిర్యానీ విక్రయించిన రాజా వారి రుచులు రెస్టారెంట్‌పై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు,
కూకట్ పల్లిలోని రాజా వారి రుచులు రెస్టారెంట్ లో తనిఖీ చేసి, ఐదువేల జరిమానా విధించారు. అయినా సరే శ్రీనివాస్ వెనక్కు తగ్గలేదు. బిర్యానీలో తీగ రావడంపై తాను వినియోగదారుల ఫోరం కి వెళ్తా అని స్పష్టం చేసాడు. అటు జోమాటో కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెస్టారెంట్ పై తగిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే ఒప్పందం రద్దు చేసుకుంటామని పేర్కొంది.