‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో తాజాగా ఇటీవల సినిమా యూనిట్ వరంగల్ లో సక్సెస్ సంబరాలు నిర్వహించింది. సంక్రాంతి పండుగకు విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతున్న తరుణంలో మహేష్ కెరీర్లోనే భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం గా రికార్డులు క్రియేట్ చేసింది.
ఇటువంటి తరుణంలో ఈ సినిమా వేడుకల్లో సినిమా హీరో డైరెక్టర్ తో పాటుగా వరంగల్ ప్రాంతంలో ప్రముఖ రాజకీయ నేతలు టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా హాజరు కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే మాస్ ప్రేక్షకులకు నెంబర్ వన్ హీరో అని ఆయన కొడుకు మహేష్ బాబు కూడా అదే స్థాయిలో ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారని మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీకి హైదరాబాద్ తర్వాత వరంగల్ అడ్డాగా మారాలని కోరారు.
చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఇండస్ట్రీని హైదరాబాద్ తర్వాత వైజాగ్ మరియు విజయవాడ ప్రాంతాలకు పర్మినెంట్ చేయాలని చూస్తున్నారని సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి కి విజయవాడ వైజాగ్ అంత ప్రేమ ఎక్కువ అని కానీ మీరు అటువైపు లాగవద్దు మా వంశీ దిల్ రాజు ఇటువైపే గుంజుకొస్తారు. మీరు అటు గుంజొద్దు. హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను సినీ అడ్డాగా మార్చేందుకు నా వంతు కృషి చేస్తా అంటూ భారీ స్పీచ్ ఇచ్చారు ఎర్రబెల్లి దయాకర్ రావు. దీంతో ఈ స్పీచ్ విన్న వరంగల్ వాసులు సూపర్ స్పీచ్ ఎర్రబెల్లి గారు అంటూ కామెంట్లు చేశారు.