రాజ్యాంగంలో అసలు భారతీయతే లేదని సావర్కర్ చెప్పినట్టు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాజాగా పార్లమెంట్ లో ఆయన మాట్లాడారు. “వేదాల తరువాత హిందూ జాతికి మనుస్మృతి ఉండడం పైనే పోరాటం జరుగుతోంది. బీజేపీని ఒక్కటే అడుగుతున్నా..? మీ మీనేత వ్యాఖ్యలకు కట్టబడ్డారా..? ఎందుకు అంటే మీరు రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్టు చెబితే సావర్కర్ ను దూషించినట్టే, అవమానించినట్టే” అని అన్నారు రాహుల్ గాంధీ.
మరోవైపు మహాభారత కాలం నుంచే వర్గ వైషమ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. అభయముద్రను చూపిస్తూ.. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలు కోసినట్టు భారత జాతి బొటనవేలిని బీజేపీ కోసేస్తోందని విమర్శించారు. బొటనవేలి నుంచి నైపుణ్యం దాని నుంచి విశ్వాసం, బలం, నిర్భయం వస్తాయన్నారు. ధారావి, పోర్టులు, ఎయిర్ పోర్టులు, డిఫెన్స్ ప్రాజెక్టులను అదానీకి ఇస్తూ బొటనవేలీ లాంటి MSMEలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ.