తప్పు చేసినందుకే కేటీఆర్ కి జైలు భయం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ కు తప్పు చేసినందుకే జైలు భయం పట్టుకుందని.. అందుకే పదే పదే అరెస్ట్ చేస్తారని, జైలుకెళ్తానని కలువరిస్తున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే కేటీఆర్ పై చట్టపరంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకోక తప్పదన్నారు. కేటీఆర్ ఏ తప్పు చేయకపోతే పదే పదే జైలుకు వెళ్తానని ఎందుకు అంటున్నాడని ప్రశ్నించారు.

Venkat
Venkat

చట్ట ప్రకారం.. విచారణ జరుగుతుందని, తప్పు చేసినట్టు తేలితే తప్పకుండా కటకటాల పాలవుతారన్నారు. ముందు కేటీఆర్ తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జైలుకు వెళ్లే ఆలోచనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బావ, బావమరుదులు సంకెళ్లతో నిరసన చేయించారని అందులో వారు మాత్రం శాంతి భద్రతల సమస్య సృష్టించాలని బీఆర్ఎస్ శ్రేణులను కేటీఆర్ రెచ్చగొడుతున్నాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ముందు పదేళ్ల వాళ్ల పాలన ఎలా సాగిందో బీఆర్ఎస్ నేతలు గుర్తుకు చేసుకోవాలన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news