కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ.. హాజరైన సోమేష్ కుమార్, స్మితా సబర్వాల్

-

జస్టీస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలోని కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఈ మేరకు కమిషన్ ఎదుట మాజీ సీఎస్ సోమేష్ కుమార్, అప్పట్లో సీఎంవోలో సెక్రటరీగా విధలు నిర్వర్తించిన స్మితా సబర్వాల్ హాజరయ్యారు. విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి కమిషన్ చైర్మన్ పినాకీ చంద్రఘోష్ వారిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. కేబినెట్ ఆమోదం లేకుండానే 3 బ్యారేజీలకు పరిపాలన అనుమతుుల ఇచ్చారా..? అని కమిషన్ స్మితా సబర్వాల్ ను కమిషన్ ప్రశ్నించింది.

కమిషన్ అడిగిన ప్రశ్నలకు నాకు తెలియదు. అవగాహన లేదని స్మితా సబర్వాల్ సమాధానాలు చెప్పింది. సీఎంవోకి వచ్చే ప్రతీ ఫైల్ కు సీఎం ఆమోదం ఉంటుందని.. సీఎంవోలో తాను ఏడు శాఖలను చూసినట్టు స్మితా సబర్వాల్ వెల్లడించారు. మై రోల్ ఈజ్ లిమిటెడ్.. జనరల్ కో ఆర్డినేషన్ మాత్రమే అని వివరించింది. మరోవైపు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టీస్ చంద్రఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విచారణ కోర్టు హాల్లోకి పిలిచిన వెంటనే రాకపోవడంతో సోమేష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్మితా సబర్వాల్ సీఎంవోలో కీలకంగా వ్యవహరించారు. సోమేష్ కుమార్ సీఎస్ గా విధులు నిర్వర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news