ఆంధ్రప్రదేశ్ అత్యవసర అసెంబ్లీ సమావేశాలలో గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన కోట్ల స్కాం బట్టబయలు అయ్యేవిధంగా లెక్కలతో సహా జగన్ సర్కార్ బయట పెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా గుర్తించారని ఆరోపించారు.
తన వర్గ ప్రజల కోసం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కోసం తన బినామీల కోసం అమరావతిని రాజధానిగా గుర్తించి దాన్ని ప్రకటించకుండా ఆ ప్రాంతంలో వెలగపూడి, మందాడ, ఐనవోలు, హరిశ్చంద్రాపురం, నంబూరులో భారీ ఎత్తున భూముల కొనుగోళ్లు మొత్తం 4 వేలకు పైగా భూములు కొనుగోలు చేసినట్లు ఎకరం రు.10 కోట్లు వేసుకున్న మొత్తం 40 వేల కోట్ల భూ దందా చేసినట్లు తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, అమరావతి, పెదకూరపాడు, పెదకాకాని మండలాల్లో చంద్రబాబు హెరిటేజ్ పేరిట, పుట్టా సుధాకర్ యాదవ్, పయ్యావుల కేశవ్, జీవి ఆంజనేయులు, పరిటాల సునీత కుటుంబ సభ్యులు పేరిట భారీ ఆస్తుల కొనుగోళ్లు చేసినట్లు అన్ని విషయాలను లెక్కలతో సహా ఎవరు ఎక్కడ ఎంతకు కొన్నారు ఎన్ని వేల ఎకరాలు కొన్నారు అన్ని విషయాలను బట్టబయలు చేశారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
అయితే ఈ విషయంలో జగన్ సర్కార్ విచారణకు వెళ్లే అవకాశం ఉండటంతో నేరం రుజువైతే అధికార దుర్వినియోగం జరిగిందని ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది ఖరారు అయితే చంద్రబాబు ఇక జైలుకే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.