ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించేందుకు ఓయూ జేఏసీ ప్రయత్నించింది. ఓయూ జేఏసీ అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇంటి ముట్టడికి ప్రయత్నం చేసారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నిన్న అల్లు అర్జున్ ఇంటి ముందు నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ.కోటి ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలోనే ఇంటి గోడలు ఎక్కి రాల్లు రువ్వారు. తాజాగా ఈ ఘటన పై ట్విట్టర్ వేదికగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.
“సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అంటూ ట్వీట్ చేశారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.