జమిలి ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారు అని శ్రీశైలం వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మద్యం టెండర్ల పేరుతో చంద్రబాబు 2 వేల కోట్లు దోచుకున్నాడు అని ఆయన తెలిపారు. ఇక ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. కానీ ఇప్పుడు వాటి ఊసే లేదు అన్నారు.
అలాగే రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతుంది టీడీపీ నాయకులే అని పేర్కొన శిల్పా చక్రపాణి.. విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై రూ. 15వేల కోట్ల భారం పడుతుంది అని స్పష్టం చేసారు. ఈ విద్యుత్ చార్జీల పెంపును నిరసనగా రేపు రెండు వేలమందితో విద్యుత్ సబ్ స్టేషన్ వరుకు భారీ నిరసన ర్యాలీ చేస్తాం అని తెలిపారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అని పేర్కొన్నారు శిల్పా చక్రపాణి.