కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పై వివక్ష చూపిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో మొండిచేయి చూపించినందుకు నిరసనగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తొలుత ర్యాలీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి జడ్పీ సెంటర్ వరకు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడారు. బడ్జెట్ లో తెలంగాణ పట్ల మోడీ సర్కార్ సవతి తల్లి ప్రేమ కనబరిచిందన్నారు.
బడ్జెట్ కేటాయింపులు చూసే మోడీ సర్కార్ బడ్జెట్ రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేసిందన్నారు. పోలవరం మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధన్యాత ఇవ్వలేదని.. ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు.