సినిమాల‌కు బ్రేక్ చెప్ప‌నున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్‌..?

-

ఇటీవ‌ల విడుద‌లైన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సినిమాలకు బ్రేక్ చెప్ప‌నున్నార‌ట‌. అంటే పూర్తి బ్రేక్ ఇవ్వ‌డం కాదండోయ్.. కేవ‌లం మూడు నెల‌లు మాత్రం సినిమాల‌కు దూరంగా ఉండ‌నున్నార‌ని తెలుస్తోంది. ఎందుకు అనేగా.. మీ సందేహం. గతంలో ఆగడు సినిమా సమయంలో షూటింగ్‌లో మహేశ్‌బాబు మోకాలికి గాయమైంది. అయితే దానికి శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్లు చెప్పినప్పటికీ మహేశ్‌ దాన్ని పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ దాన్ని వాయిదా వేశాడు.

ఇక ‘స్పైడర్‌’ చిత్రం తర్వాత శస్త్రచికిత్స చేయించుకోవాలని భావించినప్పటికీ ఎక్కువ కాలంపాటు సినిమాలకు విరామం ఇవ్వాల్సి వస్తుందని మహేశ్‌ ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఇక ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న మహేశ్‌ సర్జరీకి ఇదే సరైన సమయమని భావించినట్లు తెలుస్తోంది. ఈ నెల చివర్లోనే మహేశ్‌ మోకాలికి సర్జరీ చేయించుకోనున్నారని తెలుస్తోంది. అదేగనుక నిజమైతే మహేశ్‌ మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news