టీడీపీ ప్రత్యేక సమావేశం.. నేతలకు వర్తమానం పంపిన చంద్ర‌బాబు..

-

ఏపీ సీఎం జగన్ తాను చెప్పినట్టుగానే శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మండలి రద్దుకు సంబంధించి ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ విషయంలో కేంద్రం ఏం చేయబోతోందనే అంశంపైనే నెలకొంది. ఇక ఇదిలా ఉంటే.. నేడు టీడీపీ ప్రేత్యేక స‌మావేశం కానుంది. విజయవాడ సమీపంలో ఉన్న అందరు తెలుగుదేశం పార్టీ నేతలూ తక్షణమే తన వద్దకు రావాలని ఈ ఉదయం ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు.

రాజధాని వ్యవహారం, మండలి రద్దు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై తక్షణం చర్చించి, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన కారణంగా ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన కార్యాలయం నుంచి పార్టీ నేతలకు వర్తమానం అందింది. ఇదే సమావేశంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపైనా చర్చ ఉంటుందని సమాచారం. ఈ ఉదయం 11 గంటల నుంచి ఈ సమావేశం ప్రారంభం అవుతుందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news